ఆ డైరెక్టర్ లో మస్త్ టాలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే రాస్తే అదిరిపోవాల్సిందే. నాట్ ఓన్లీ డైరెక్టర్ రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూడు బాధ్యతలను మోస్తూ చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ వెర్సటైల్ అండ్ టాలెంట్ దర్శకుల్లో ఒకరు మిస్కిన్. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 పర్సెంట్ సక్సెస్ రేష్యో ఉన్న డైరెక్టర్. చితిరం పేసుతాడీతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు మిస్కిన్. అంజాతే, నందలాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. రైటింగ్, స్క్రీన్ ప్లేతో సినిమాను హిట్టు బాట పట్టిస్తుంటాడు. మూగమూడి, పిశాచు, తుప్పరివాలన్ చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్.
Also Read : Akanksha Sharma : కుర్రకారు మదిలో కాంక్ష రేపుతున్న లైలా బ్యూటీ ‘ఆకాంక్ష శర్మ’ ..
మిస్కిన్ లో చాలా టాలెంట్స్ ఉన్నాయి. కెమెరా వెనుకే కాదు కెమెరా ముందుకు కూడా యాక్టింగ్ ఇరగదీస్తాడు మిస్కిన్. నందలాల, సవర్ కత్తి, సూపర్ డీలక్స్ లో అద్బుతమైన నటనను కనబర్చాడు. రీసెంట్లీ మ్యూజిక్ బాధ్యతలు తీసుకున్నాడు. డెవిల్ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఇవన్నీ పక్కన పెడితే సైకోలాంటి బ్లాక్ బస్టర్ బొమ్మ పడిన తర్వాత డైరెక్టర్ గా బిజీగా మారిపోదామనుకున్నాడు. ఆ ప్రయత్నమే చేశాడు కానీ మిస్కిన్ విషయంలో ఒకటి అనుకుంటే మరోటి జరిగింది. పిశాచుకు సీక్వెల్ పిశాచు 2ను తెరకెక్కించాడు. ఆండ్రియా మెయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. కానీ సినిమా కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు ట్రైన్ మూవీ చేస్తున్నాడు మిస్కిన్. ఈ సినిమా రాత్రి, పగలు తేడా లేకండా కష్టపడుతున్న మిస్కిన్. అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటుంటాడు. రీసెంట్లీ ఇళయరాజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి కోలీవుడ్ సెలబ్రిటీలతో చీవాట్లు తిని ఎట్టకేలకు సారీ చెప్పాడు.