Telugu GOAT underperforms But Sanivaaram holds on Telugu Box Office: ప్రతి వారం లాగానే గత వారాంతంలో, మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన “GOAT”, నివేదా థామస్ నటించిన “35-చిన్న కథ కాదు”, తేజస్ కంచర్ల“ఉరుకు పటేల. ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినిమా చూసిన తరువాత తెలుగు క్రిటిక్స్ ఊహిచినట్టుగానే తలపతి విజయ్ “GOAT” తమిళనాడు, USA లో చాలా బలంగా ప్రదర్శించబడుతోంది, కానీ తెలుగు వెర్షన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.9 కోట్లు వసూలు చేసింది. విజయ్ సినిమాకు ఇది చాలా తక్కువ.
కిరణ్ అబ్బవరానికి స్టార్ హీరో భలే దొరికాడే!
“GOAT” తెలుగు సినీ విమర్శకుల నుండి పూర్తిగా నెగటివ్ రివ్యూస్ ను అందుకుంది. ఇక నివేదా థామస్ నటించిన “35-చిన్న కథ కాదు”, ప్రేక్షకుల నుండి మంచి రివ్యూస్, ప్రశంసలను అందుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశాజనకంగా లేదు. వర్డ్ ఆఫ్ మౌత్ జనాల్లోకి వెళుతోంది కాబట్టి నెక్స్ట్ వీక్ కి పెరగొచ్చు. ఎందుకంటే ని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్లలో కొంత రైజ్ కనిపించింది. ఇక “ఉరుకు పటేలా” గురించి మాట్లాడుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అవడమే తక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. సినిమా కూడా అంత బాలేదు కాబట్టి వర్కౌట్ కానట్టే. ఆయుయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాని “సరిపోదా శనివారం” రెండవ శని, ఆదివారాల్లో మంచి కలెక్షన్లను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారతదేశంలో 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు అయింది.