Kiran Abbavaram’s KA worldwide Malayalam version release by Dulquer Salmaan’s Wayfarer films:కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ “క” సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో “క” సినిమా గురించి వస్తున్న పాజిటివ్ టాక్ ఇతర చిత్ర పరిశ్రమల దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక తాజాగా “క” సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. మలయాళంలో “క” సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
Mamata Banerjee: డాక్టర్ ఫ్యామిలీకి డబ్బులు ఆఫర్ చేయడంపై మమత ఏమన్నారంటే..!
“క” సినిమా ఫస్ట్ లుక్, టీజర్ చూసిన దుల్కర్ సల్మాన్ ఇంప్రెస్ అయి మలయాళ వెర్షన్ తమ వేఫరర్ ఫిలింస్ సంస్థలో విడుదల చేసేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. స్ట్రాంగ్ కంటెంట్ తో “క” సినిమా ఈ క్రేజ్ ను క్రియేట్ చేస్తుండగా ఈ సినిమా తెలుగు రైట్స్ ను నిర్మాత వంశీ నందిపాటి తీసుకున్నారు. ఇదే క్రమంలో త్వరలోనే తమిళ, కన్నడతో పాటు ఇతర భాషల బిజినెస్ క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. “క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్న ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు.