యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ చిత్రం చై కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డు సృష్టిస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక ‘తండేల్’ మూవీ కి వస్తున్న ఆదరణ చూసి, కొడుకు సాధించిన విజయానికి తండ్రి నాగార్జున చాలా గర్వపడుతున్నాడు. తాజాగా కింగ్ నాగ్ ట్వీట్ వేస్తూ.. ‘ఇన్నేళ్లు ఎంత కష్టపడ్డావో,ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వస్తున్నావో చూస్తూనే ఉన్నాను.. తండేల్ అనేది కేవలం ఓ సినిమా కాదు నీ శ్రమకు నిదర్శనం. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ చైతూ సినిమా గురించి మాట్లాడారు. అంతే కాదు ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు చై ని ఎంతో ప్రశంశించారు. ఇక ఈ మూవీ కలేక్షన్స్ విషయానికి వస్తే..
Also Read:Trisha: సర్జరీకి సిద్ధమైన హీరోయిన్ త్రిష..!
ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.21 కోట్లకు పైగా గ్రాస్ అందుకోగా.. రెండో రోజు సైతం రూ.20 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. అలా రిలీజ్ అయిన 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా మొత్తం రూ.41.2 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ మేరకు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.. ఇక మూడోరోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్‌ను చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా, ఆల్ మోస్ట్ రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని విధంగా మూడో రోజుకు రూ.62.37 కోట్ల గ్రాస్ కు చేరుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధిక వసూళ్లు రాబడుతుంది.