కంగువా రిజల్ట్ సూర్యలో భారీగానే ఛేంజెస్ తెచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు సూర్య. సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా ఫెయిలైతే కొన్నిరోజులు వార్తల్లో నిలుస్తుంటారు. ఆ తర్వాత ఎవరి వర్క్ వారిదే. కానీ కంగువా భారీ ఫెయిల్యూర్ తర్వాత సూర్య ఎక్కువగా ఫోకస్ అవుతున్నాడు. అఫ్ కోర్స్ సినిమా అప్ డేట్స్ మాత్రమే కాదు అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా కోలీవుడ్ హీరో పేరు బాగా సర్క్యులేట్ అవుతుంది.
Also Read : NTRNeel : ‘డ్రాగన్’ సెకండ్ షెడ్యూల్ కు భారీ ప్లానింగ్
కంగువా రిజల్ట్ తర్వాత సూర్యలో భారీ మార్పులే కనిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎక్కువ టైం వెచ్చించడంతో ఫ్యాన్స్‌తో టచ్ కోల్పోయాడు. ఈ గ్యాప్ ఫిల్ చేసుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దించేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే రెట్రో కంప్లీట్ చేసేశాడు సూర్య. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మరో మూవీని చేస్తున్నాడు. దీనికి గుమ్మడికాయ కొట్టగానే వెట్రిమారన్ తో వాడివాసల్ చేయబోతున్నాడు. ఈ త్రీ మూవీస్ ఓకే మరీ వాట్ నెక్ట్స్ అనుకున్న సూర్య లైనప్స్ పెంచుకునే పనిలో ఉన్నాడట. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రోలెక్స్ కూడా కమిటవుతాడని టాక్. అలాగే ఎప్పటి నుండో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సూర్యకు ఇప్పుడు ఆ ఛాన్స్, టైం దొరికింది. అందుకే ఇద్దరు టాలీవుడ్ దర్శకులను లైన్లో పెట్టాడని తెలుస్తోంది. వెంకీ అట్లూరీతో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫమ్ అయినట్లు టాక్. ఇక చందు మొండేటీతో చర్చలు నడుస్తున్నాయి. ఇవి కాకుండా అటు మలయాళ దర్శకులతోనూ సిట్టింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. లైనప్స్ తోనే క్యూరియస్ పెంచేస్తున్నాడు సూర్య.