Allu Arjun – Atlee: అల్లు అర్జున్ – అట్లీ సినిమా.. ఆ వార్తల్లో నిజం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు అట్లీ కలిసి ఓ భారీ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సన్ నెట్వర్క్ తప్పుకుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దిల్ రాజు దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అభిమానులను ఉత్కంఠకు గురి చేసిన ఈ పుకార్లను ఖండిస్తూ, ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చాయి. అదేమంటే ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు అట్లీ దుబాయ్‌లో ఉన్నారని, అక్కడ సినిమా కథా చర్చల్లో మునిగి ఉన్నారని సమాచారం.
Court Movie : కోర్టు మూవీ మొదటి వారం కలెక్షన్లు ఎంతంటే..?
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
వీరిద్దరూ ఈ స్టోరీ సిట్టింగ్స్ కోసం మరో 10-15 రోజుల పాటు దుబాయ్‌లోనే ఉండనున్నారట. ఈ సినిమా కథను పక్కాగా సిద్ధం చేసేందుకు ఇరువురూ తీవ్రంగా కృషి చేస్తున్నారని అంటున్నారు. అట్లీ తన మార్క్ స్టైల్‌లో హై-ఎనర్జీ యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామాతో కూడిన కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది, అది అల్లు అర్జున్ ఇమేజ్‌కి సరిగ్గా సరిపోతుందని సమాచారం. ఈ కథా చర్చలు అనుకున్నట్లు సాగి, అన్ని విషయాలు కుదిరితే, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (ఏప్రిల్ 8) ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘పుష్ప’ సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఇప్పుడు అట్లీతో ఈ కొత్త సినిమాతో మరింత ఎత్తుకు ఎదగాలనే ప్లాన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..