ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అయినా ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు సిద్ధూ జొన్నలగడ్డ. దానికి సీక్వెల్ గా వచ్చిన ‘డీజే టిల్లు -2′ తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసి సూపర్ హిట్ సినిమాల హీరో అని అనిపించుకున్నాడు. ప్రస్తుతం కోహినూర్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి వారు నిర్మించే ‘తెలుసు కదా’ అనే సినిమాలోను నటిస్తున్నాడు ఈ కుర్ర హీరో.
Also Read : Nagavamsi : బోని కపూర్ కు దిమ్మతిరిగేకౌంటర్ ఇచ్చిన నాగవంశీ
అయితే తాజగా సిద్దూ తో డీజే టిల్లు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసాడు. నాగవంశీ మాట్లాడుతూ ” నేను సిద్దూ కలిసి ఓ సినిమా చేయబోతున్నాం. అది ‘అర్జున్ రెడ్డి’ సినిమా లాంటి తరహా కథ. ప్రస్తుతం ఈ సినిమా కథ పై చర్చల్లో ఉంది. ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు, కచ్చితంగా అయితే సినిమా చేస్తాం. సిద్ధు కూడా ఆ సినిమా పై చాలా ఇంట్రస్ట్ ఉన్నాడు. ఇప్పటి దాక సిద్దూని ఒకలా చూసారు ఈ సినిమాతో మరొకలా చూస్తారు. కానీ ఈ చిత్రం వచ్చేందుకు చాలా టైమ్ పడుతుంది. హిట్ అయితే కొత్తగా ట్రై చేసారు సూపర్ గా చేసారు అంటారు. ప్లాప్ అయితే చేతులు కాల్చుకున్నారు అంటారు. ఏదేమైనా ఈ కథతో మాత్రం సినిమా చేసి తీరుతాం’ అని అన్నారు. నాగవంశీ ఈ రేంజ్ లో చెప్తున్న ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.