పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ అనే భారీ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా ? అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా ఉగాది పండుగా వేడుకలలో పాల్గోన్న సందీప్ మాట్లాడుతూ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జరుపబోతున్నట్లు ప్రకటించాడు. ఇంతకంటే ఏం అప్‌డేట్ ఇవ్వలేమని తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నారనే వార్తలపై తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.
Also Read: Mega 157: చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ లో వెంకటేష్ గెస్ట్ రోల్ ?
వర్మ ఇంతకు ముందు ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో స్పెషల్ క్యామియో చేసిన సంగతి తెలిసిందే. చీఫ్ చింటు అనే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారిగా ఆయన ఈ మూవీలో కనిపించాడు. ఆయన కనిపించిన సీన్స్ కొద్ది సేపే అయిన థియటర్లో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సందీప్ రెడ్డి తీస్తున్న ‘స్పిరిట్’ సినిమాలోనూ ఆర్జీవీ నటిస్తారని టాక్ నడిచింది. కాగా లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. ప్రభాస్ తో మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పై క్లారిటీ ఇచ్చాడు.. ‘ ‘స్పిరిట్’ సినిమాలో నేను ఓ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాననే వార్త చాలా రోజులుగా వింటున్నాను. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే అసలు నేను సందీప్ వంగాని ఎప్పుడూ అడగలేదు. దాని గురించి నాకు ఏమీ తెలియదు. నాకు అశ్వినీ దత్, ప్రభాస్ తెలుసు. సరదాగా ‘కల్కి’ లో చేయమని అడిగారు.. చేశాను అంతే. దాని కోసం పెద్దగా ఆలోచించి చేసిందేమీ లేదు. కానీ ‘కల్కి’ సినిమాలో నా పాత్రకి జనాల నుంచి వచ్చిన రియాక్షన్ చూసి సర్ప్రైజ్ అయ్యాను’ అని క్లారిటీ ఇచ్చారు వర్మ.