‘బీటీఎస్’… ఈ పేరు ఇండియాలో అందరికీ తెలుసని చెప్పలేం. కానీ, ఇంటర్నేషనల్ మ్యూజిక్ ట్రెండ్స్ ని ఫాలో అయ్యేవారికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు జపాన్ మొదలు అమెరికా వరకూ గ్లోబ్ మొత్తాన్నీ ‘బీటీఎస్’ మ్యూజిక్ బ్యాండ్ పాటలే ఉర్రూతలూగిస్తున్నాయి. బీటీఎస్ టీమ్ లోని బాయ్స్ కోట్లాది మందికి ఫేవరెట్ ఐకాన్స్!
ప్రపంచాన్ని తమ పాప్ సాంగ్స్ తో చిత్తు చేస్తోన్న బీటీఎస్ సింగర్స్ చాన్నాళ్ల క్రితం పాడిన పాట ‘డైనమైట్’! అయితే, ఇది ఇప్పటికీ హాట్ ఫేవరెటే! ఎన్నో దేశాల్లో ‘డైనమైట్’ సాంగ్ కు లైఫ్ టైమ్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, బీటీఎస్ బాయ్స్ లో ఒక గాయకుడికి ఈ పాట రికార్డింగ్ టైంలో చుక్కలు కనిపించాయట! అస్సలు పాడలేకపోయాడట. కానీ, చివరకు ఎంతో శ్రమ చేసి ‘డైనమైట్’ రికార్డింగ్ పూర్తి చేశాడట! అతనే బీటీఎస్ టీమ్ లోని ‘జంగ్ కుక్’…
‘డైనమైట్’ సాంగ్ ఇంగ్లీష్ వర్షన్ రికార్డింగ్ సమయంలో జంగ్ కుక్ ఆంగ్ల పదాలు అస్సలు సరిగ్గా ఉచ్ఛరించలేకపోయాడట. బ్యాంగ్ టన్ బాయ్స్ ది (బీటీఎస్) సౌత్ కొరియా కావటంతో సహజంగానే కొరియన్ యాక్సెంట్ ధ్వనిస్తుంది. ఇక జంగ్ కుక్ కి అయితే ఇంగ్లీష్ పదాలు పలకటం మరింత కష్టమైందట. అందుకే, చాలా రోజులు మళ్లీ మళ్లీ ఇంగ్లీష్ లిరిక్స్ పలకటం ప్రాక్టీస్ చేసి అప్పుడు రికార్డ్ జరిపారట. తరువాత ఏమైందో తెలిసిందేగా! ‘డైనమైట్’ మ్యూజికల్ చార్ట్ బస్టర్ గా పేలిపోయింది!
‘డైనమైట్’ సాంగ్ తన వల్ల కాలేదని స్వయంగా జంగ్ కుక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు బీటీఎస్ ఫ్యాన్స్ ని ఈ సంగతి ఆశ్చర్యపోయేలా చేస్తోంది!