గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఎస్జె సూర్య పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఎస్జె సూర్య మా స్నేహితుడు డిప్యూటీ సీఎం అఫ్ ఆంధ్ర ప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఇప్పుడు కూర్చోబెడితే నాకు నోట్లో నుంచి మాటలు రావడం లేదు. ఎందుకంటే ఆయనని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇది ఒక మంచి స్వీట్ మూమెంట్. ఈ ఈవెంట్ హిస్టరీ లో ఉండబోతోంది అలాంటి ఈవెంట్ ఇది. గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వచ్చింది చాలా స్పెషల్. సంక్రాంతికి ఈ సినిమా వస్తుంది. నా లైఫ్ లో ఇద్దరు నా థాట్ ప్రాసెస్ మార్చేశారు. ఒకరు ఏఆర్ రెహమాన్, ఇంకొకరు పవన్ కళ్యాణ్.
Anjali: ఈ సినిమాలో నాకు అదే పెద్ద కనెక్షన్ !
పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా చేస్తున్నప్పుడు నేను ఆయనకు కథ చెప్పాను, కథ విని సూర్య సినిమాలో ఒక సాంగ్ రెండు మూడు ఫైట్ సీక్వెన్స్లు యాడ్ చేయాలి అన్నారు. అప్పుడు వచ్చిందే ఏ మేరా జహాన్ సాంగ్. ఆరోజు అన్న మాటలు ఇప్పటికి ఆయన క్యారీ చేస్తున్నారు. మాటకి నిలబడాలి అని నాకు నేర్పించింది పవన్ కళ్యాణ్ గారు. ఒక మాట ఇస్తే మాటకి నిలబడాలి ప్రాణం ఇచ్చి అయినా సరే ఆ మాటకు నిలబడాలి అని ఆయన నాకు నేర్పించారు. ఆయన పక్కన కూర్చుని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన విజన్ ఉన్న ఒక గొప్ప వ్యక్తి, ఆయన ప్రజలను ఎంతో ప్రేమిస్తారు. ఆయన పదవి కోసమో పవర్ కోసం కాదు ఆయన మీ కోసమే బతుకుతున్నారు. ఎందుకంటే ఆయనకి ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ లోకి వెళితే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఎప్పుడూ ప్రజల గురించే మాట్లాడుతారు అని అన్నారు.