చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘సామజవరగమన’ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సంక్రాంతి పండుగకు సరైన హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌పై ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘నారి నారి నడుమ మురారి’ 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సంక్రాంతి అనేది తెలుగు సినిమా రిలీజ్‌లకు అత్యంత పెద్ద సీజన్ కావడంతో, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అయిన ఈ చిత్రం పండుగ విడుదలకు పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Also Read :Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్‌లో టెన్షన్ టెన్షన్..
సంక్రాంతి పండుగ సమయంలో హీరో శర్వాకు స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో సంక్రాంతికి విడుదలైన ఆయన చిత్రాలు ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటివి పెద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండుగ సెలవులు ‘నారి నారి నడుమ మురారి’ చిత్రానికి గణనీయమైన ఉత్సాహాన్ని, విజయాన్ని ఇస్తాయని టీం నమ్మకంగా ఉంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేయగా, మరింత ఎక్సయిటింగ్ కంటెంట్‌ను ప్రామిస్ చేస్తూ త్వరలో నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.