‘సారా అర్జున్’.. ఈపేరు ఇప్పుడు భారతీయ సినీ రంగంలో మారుమోగుతోంది. మొదటి సినిమాలోనే తనకంటే 20 ఏళ్ల పెద్ద హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘చిన్న పిల్ల’ అంటూ విమర్శలు చేసిన నోళ్లతోనే వావ్ అనిపించుకుంది సారా. తొలి సినిమాతోనే భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. వంద కాదు, రెండొందలు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల హీరోయిన్‌గా ఎదిగింది. ఎవరూ ఊహించని విధంగా 2025లో కలెక్షన్స్ పరంగా సారా తోపు హీరోయిన్ అనిపించుకుంది. చిన్నప్పుడే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది. 20 ఏళ్లకే సారా ఓ అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకుంది.
రణవీర్ సింగ్‌తో రొమాన్సా.. అంటూ తనపై ట్రోల్ చేసిన వాళ్లందరి నోళ్లు ‘ధురంధర్’తో మూయించింది సారా అర్జున్. ధురంధర్ టీజర్ వచ్చినప్పుడు రణవీర్- సారా మధ్య ఏజ్ డిఫరెన్స్ పాయింట్ అవుట్ చేస్తూ విమర్శించిన వాళ్లే.. ఇప్పుడు సినిమాలో వాళ్ల కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తున్నారు. సారా సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధురంధర్ భారీ విజయంతో ఏ హీరోయిన్‌కు దక్కని క్రెడిట్ సారా సొంతమైంది. 20 ఏళ్ల వయసులో వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసిన సినిమా హీరోయిన్ అయ్యింది ఈ బ్యూటీ. 2025 హయ్యెస్ట్ గ్రాసర్ ఇండియన్ సినిమాగా అవతరించింది ధురంధర్.
Also Read: New Year 2026-Vizag: న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన విశాఖ.. ఈసారి డబుల్ టార్గెట్!
ముంబైలో జన్మించిన సారా అర్జున్.. చియాన్ విక్రమ్ నటించిన ‘నాన్న’ సినిమాతో పాపులర్ అయింది. నాన్నలో విక్రమ్, సారా యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. అప్పుడు ఆమె వయసు 6 సంవత్సరాలు. ఆపై తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. 2022లో మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో 18 ఏళ్ల వయసులో జూనియర్ ఐశ్వర్య రాయ్ పాత్రలో కనిపించి.. మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె యాక్టింగ్ సినీ ప్రియులకు తెగ నచ్చేసింది. ఇక బాలీవుడ్ చిత్రం ధురంధర్‌తో కథానాయికగా పరిచయం అయింది. సారా ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుస్తుందో చూడాలి.