ఈటీవీలో వచ్చిన “ఢీ”లో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఎంతోమందిని అలరించింది సాయి పల్లవి. ఆ తర్వాత మలయాళ చిత్రం ప్రేమమ్’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది సాయి పల్లవి. మలర్ గ ప్రేమమ్ లో సాయి పల్లవి యాక్టింగ్ అటు మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొంది. ఆ తర్వాత వరుస సినిమాల విజయాలతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ సరసన నిలిచింది సాయి పల్లవి. కానీ కథల విషయంలో సాయి పల్లవి చాల స్ట్రిక్ట్. సినిమాలో తన పాత్రకు తగిన ప్రాధాన్యం లేకుంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా నటించదు. సాయి పల్లవి ప్రధాన ఆకర్షణ డాన్స్, సహజత్వంతో కూడిన నటన.
కాగా సాయి పాల్లవి 9 సంవత్సరాలలో 19 సినిమాలు నటించింది. ప్రతీ చిత్రం దేనికవే కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలే. ఇదిలా ఉండగా సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ ప్రతిష్గాత్మకంగా భావించే ఫిలిం ఫేర్ అవార్డ్స్ ను మరో సారి సాయి పల్లవి దక్కించుకొంది. 68వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో భాగంగా తమిళంలో నటించిన గార్గీ మూవీకి గాను ఉత్తమ నటిగా, ఇటు తెలుగులో రానా, సాయి పల్లవి కలిసి నటించిన విరాట పర్వం చిత్రంలోని అద్భుత నటనకు గాను క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకుంది సాయి పల్లవి. రెండు భాషలలో ఒకే ఏడాదిలో రెండు అవార్డులు సాధించిన ఏకైక హీరోయిన్ గా గుర్తింపు పొందింది. సాయి పల్లవి కెరీర్ మొత్తంగా 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించించి ఎవరికీ లేని రికార్డును తన పేరిట నమోదు చేసింది. ఈ సందర్భంగ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సాయి పల్లవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: Akshay kumar : నా సినిమాలు ఫ్లాప్ అయితే వారు సెలబ్రేట్ చేసుకుంటారు…