నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎస్‌వీ సినిమాస్ బ్యానర్ లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రోడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా జాయిన్ అయ్యారు. అంతా బాగున్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే శ్రద్ధా కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించినప్పటికీ ఆఫిషియల్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేదు. కానీ శ్రద్ధా కపూర్ భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనక్కి తగ్గారు అని మాత్రం టాక్. ఇక అల్‌రెడి ‘హాయ్ నాన్న’ మూవీలో నాని సరసన మృణాల్ నటించింది. మళ్లీ అదే కాంబినేషన్ ఆడియెన్స్‌కు బోరింగ్ అనే ఉద్దేశంతో ఆమెను పక్కన పెట్టారు. అయితే తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది.
Also Read:Allu Arjun: మరో ఘనత సాధించిన అల్లు అర్జున్..
ప్రజంట్ ‘ది ప్యారడైజ్’ మూవీలో హీరోయిన్‌గా రష్మిక పేరు గట్టిగా వినపడుతుంది.ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్‌కి రష్మిక అయితే బాగా సెట్ అవుతుందనే అభిప్రాయంలో ఉన్నాడట దర్శకుడు శ్రీకాంత్. అంతే కాదు రష్మిక గ్లామర్, పెర్ఫార్మెన్స్ కాంబినేషన్ ఈ మూవీకి పర్ఫెక్ట్‌గా సరిపోతుందని, నాని స్వయంగా ఆమె డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ రష్మిక ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో మనకు తెలిసిందే. వరుసగా చావా, అనిమల్, పుష్ప సినిమాల విజయాల తర్వాత ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ పెరిగింది. ప్రజంట్ ‘కుబేర’ తో పాటు మరి కొన్ని సినిమాలతో ప్యాక్ అయిన ఆమె, నాని ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నదే ప్రశ్న.