రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఆ జోష్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది.ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడువులైన ది రాజా సాబ్ ఫస్ట్ గ్లిమ్స్ ను విశేష స్పందన లభించింది.
Also Read : Dil Raju : ‘గేమ్ ఛేంజర్’ కథ ఎవరి కోసం రాసారో తెలిస్తే షాక్ అవుతారు.?
ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్. కాగా రాజా సాబ్ థియేట్రికల్ రైట్స్ కు తీవ్ర పోటీ నెలకొంది. ఫైనల్ గా ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీస్ నిర్మాతలు నైజాం థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకున్నారు. మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా భారీ ఎత్తున విడుదల కానుందిఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70 mm ను రాజాసాబ్ ఇప్పుడే లాక్ చేసేసారు మైత్రి నిర్మాతలు. కల్కి సూపర్ హిట్ తో తర్వాత రాబోయే రాజా సాబ్ డే 1 భారీ ఓపెనింగ్ రాబట్టే అవకాశం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తుండగా యస్ యస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు