మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.ఇటీవల రిలీజ్ అయిన రా మచ్చ లిరికల్సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. డిసెంబరు 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది గేమ్ ఛేంజర్.
Also Read : Kortala Siva : దేవర – 2 కు రత్నవేలును తొలగించమని ఫ్యాన్స్ గోల?
కాగా ఈ సినెమా గురించి దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓ ఇంటర్వ్యూ లో దిల్ రాజు మాట్లాడుతూ ” శంకర్ దగ్గర ఓ కథ ఉందని మేనేజర్ ద్వారా తెలిసింది. శంకర్ వచ్చి కలిసి 45 నిముషాలు నరేషన్ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు శంకర్ ను ఈ కథ కోసం ఎవరినైనా అనుకున్నారా అని అడిగాను, అయన ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కోసం అనుకున్నాను. అప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు కాదు రామ్ చరణ్ కి అయితే అదిరిపోతుంది చెప్పాను. రామ్ చరణ్ ఆ సమయంలో ‘RRR’ షూట్ లో ఉంటె నేను వెళ్లి కలిసి శంకర్ ఇలా లైన్ చెప్పారు విను అని చెప్పి శంకర్ తో కథ చెప్పించాను. చరణ్ ఒకే చెప్పడంతో అలా స్టార్ట్ అయింది గేమ్ ఛేంజర్” అని అన్నారు. ఒకవేళ పవన్ కళ్యా న్ నటించి ఉంటె ఎలా ఉండేదో రిలీజ్ అయితే కానీ తెలియదు.