లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రం తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. ‘పోలీస్ కంప్లెయింట్’ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆమె తొలిసారిగా పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్మాతలు తెలిపారు.
Also Read :Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ..!
ఈ సినిమాకు మరో హైలైట్‌గా సూపర్‌స్టార్ కృష్ణ గారిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ఉండబోతోందని నిర్మాతలు వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ— “‘పోలీస్ కంప్లెయింట్’ సినిమాను ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌పై నిర్మిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నాం. చిత్ర యూనిట్ అందరి సహకారంతో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశాం, సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది” అని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కాగానే సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘పోలీస్ కంప్లెయింట్’ టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోందని చిత్రయూనిట్ చెబుతోంది.