లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రం తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. ‘పోలీస్ కంప్లెయింట్’ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆమె తొలిసారిగా పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం సినిమాకే ప్రత్యేక…