టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వరలక్ష్మి శరత్‌కుమార్, టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. హారర్ థ్రిల్లర్ అంశాలకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్‌మెంట్ జోడించి దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా తెలుగు, కన్నడ టీజర్ లాంచ్ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. సాధారణంగా వరలక్ష్మి శరత్‌కుమార్ అంటే పవర్‌ఫుల్…
లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రం తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. ‘పోలీస్ కంప్లెయింట్’ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆమె తొలిసారిగా పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం సినిమాకే ప్రత్యేక…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సవాలాత్మక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ స్థాయికి చేరుకుంది. ఆమె తాజాగా తెలుగులో ‘పోలీస్ కంప్లెయింట్’ అనే సినిమా చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో వరలక్ష్మి శక్తివంతమైన పాత్రతో పాటు, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో కనిపించనుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్…