అందం, నటన రెండు ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక పెద్ద రేంజ్‌కి వెళ్లని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు పాయల్ రాజ్ పుత్. ‘RX100’ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది. మొదటి చిత్రంతోనే విలన్‌గా ఆమె నటన తో ఓ రేంజ్‌లో ఆడియన్స్‌ని అలరించి. అయితే విలన్ క్యారెక్టర్ చేయడం కంటే ఆమె చేసిన బోల్డ్ సీన్స్ తో ఆమె కెరీర్ పై ప్రభావం చాలా బలంగా పడింది. దీంతో ఆమెకు అని అలాంటి అవకాశాలే వచ్చాయి. ఇండస్ట్రీలో ఒక్క పాత్రను పదే పదే చేయడం వల్ల దానికే పరిమితం అవుతారు. ఇప్పుడు పాయల్ విషయంలో కూడా అలాగే జరిగింది. అందుకే అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. అయితే రీసెంట్‌గా ఆమె ట్విట్టర్ లో చేసిన కామోంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: Rashmika : ఆ విషయంలో హీరోల బాటలో నడుస్తున్న రష్మిక..
‘ఇండస్ట్రీలో కొనసాగడం అత్యంత కఠినమైన పరిస్థితిగా మారిపోయింది. ప్రతి రోజు ఏదో తెలియని భయం తో మన రోజు మొదలవుతుంది. ఇండస్ట్రీ లో నెపోటిజం రాజ్యం ఏలుతుంది. నిజమైన టాలెంట్ ఈ నెపోటిజం ముసుగులో కనుమరుగు అయిపోతుంది. నేను పడే కష్టానికి తగ్గ ఫలితం, నా టాలెంట్ కి తగ్గ అవకాశాలు భవిష్యత్తులో అయినా వస్తాయా లేదా అని ఆలోచించినప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళ కారణంగా అవకాశాలు నా చెయ్యి నుండి జారిపోవడం చాలాసార్లు జరిగింది. ఇలాంటివి తలచుకున్నప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది’ అంటూ పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.