ప్రజంట్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు రష్మిక మందన్న. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి రష్మిక తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టూ బ్యాక్ ‘యానిమల్’, ‘పుష్ప 2: ది రూల్’ ,రీసెంట్‌గా ‘ఛావా’ ఈ మూడు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రష్మిక. ముఖ్యంగా ‘ఛావా’ తో ఏకంగా బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ అందుకుంది. ఫలితంగా రష్మిక మందన్న బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. అయితే మనకు తెలిసి ఫేమ్ వచ్చాక ఎవరైనా రెమ్యునరేషన్ విషయంలో మార్పులు చేస్తుంటారు. ఇక తాజాగా రష్మిక కూడా అదే చేసిందట. స్టార్ డమ్ పెరిగే కొద్దీ రష్మిక రెమ్యునరేషన్ పెంచేస్తుంది. ప్రస్తుతం ఒకొక్క సినిమాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన రూటు మార్చేసిందట.
Also Read: Niharika : మరో సినిమా నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల.. హీరోగా సంగీత్ శోభన్
రాబోయే చిత్రాలకు ఇకపై రెమ్యూనరేషన్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నద రష్మిక. ఎందుకంటే రెమినరేషన్‌కు బదులు ఏకంగా సినిమా ప్రాఫిట్ లో 10 శాతం వాటా కావాలని డిమాండ్ చేస్తున్నట్టు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది. ఇక రష్మిక మందన్న నటించిన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిర్మాతలు కూడా అందుకు అంగీకరిస్తునట్లు తెలుస్తుంది. అయితే ఇలా లాభాల్లో షేర్లు తీసుకునే పద్ధతి కేవలం హీరోలకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రష్మిక మందన్న కూడా వీరి బాటలో నడుస్తుంది.