భారీ బడ్జెట్ చిత్రాలు తీసినా క్రేజీ డైరెక్టర్లతో వర్క్ చేసినా ఎలా చేసిన సరే సూర్య రిజల్ట్‌లో మార్పు ఉండటం లేదు. ఈటీ తర్వాత క్యామియో రోల్స్‌కే పరిమితమైన ఈ కోలీవుడ్ స్టార్ హీరో కంగువా కోసం ఏకంగా ఫోర్ ఇయర్స్ కష్టపడ్డాడు. కానీ ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచింది. సూర్య చేసిన కష్టం వృథాగా మారింది. అటు నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలు ఇచ్చింది. ప్రయోగాలెందుకులే అని స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ‘రెట్రో’ సినిమా చేసాడు. ఇది కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Spirit : స్పిరిట్ షూటింగ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన నిర్మాత భూషణ్ కుమార్
ఇక ప్రజెంట్ సూర్య చేతిలో ఆర్జే బాలాజీ 45తో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని కథలు వింటున్నాడు. రీసెంట్లీ లోకేశ్ కనగరాజ్ కూడా విక్రమ్‌లో చిన్న క్యామియోగా పరిమితమైన రోలక్స్ క్యారెక్టర్‌తో సినిమా ఉండబోతుందంటూ ఓ స్టేట్ మెంట్ పాస్ చేశాడు. ప్రజెంట్ సూర్య కమిట్మెంట్స్ వల్ల లోకీ ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతుంది. కానీ ప్రాజెక్ట్ పక్కా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ప్లాప్స్ ఉన్నా సూర్యపై భారీగానే ఖర్చు పెట్టేందుకు ప్రిపేర్ అవుతున్నాయి ప్రొడక్షన్ హౌస్‌లు. సూర్య 45 కోసం రూ. 65-100 కోట్లు పెడుతోంది డ్రీమ్ వారియర్ పిక్చర్స్. అలాగే వెంకీ అట్లూరితో ప్రాజెక్ట్ కోసం రూ. 120 కోట్లు వెచ్చిస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇక లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ అంటే కోట్లు బడ్జెట్ కేటాయించాల్సిందే. అలాగే సూర్య కూడా రెమ్యునరేషన్ కూడా ఛేంజ్ చేశాడట. కంగువా కోసం రూ. 39 కోట్లు తీసుకున్న సూర్య ఇప్పుడు వెంకీతో చేస్తున్న మూవీ కోసం రూ. 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని టాక్. ఇలా ఓవైపు ప్లాపులు వస్తున్న కూడా సూర్య రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా తగ్గడంలేదు.