ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్స్ లోఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అనగానే
అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసుకుంటు వెళ్ళాడు నీల్.
Also Read : KANTHA : భారీ డిజాస్టర్ గా నిలిచిన దుల్కర్ – రానా దగ్గుబాటి ‘కాంత’
కానీ ఇటీవల ఈ సినిమా షూట్ కు అనుకోకుండా బ్రేక్ పడడంతో ఈ సినిమాపై లేని పోనీ రూమర్స్ వచ్చాయి. దానికి తోడు ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. ఈ లుక్ చూసి మరీ లీన్‌గా ఉన్నాడేంటని అనుకున్నారు. దానికి తోడు సినిమా ఆగిపోయిందని వార్తలు ఫ్యాన్స్ ను ఎక్కువ టెన్షన్ పెట్టాయి. వాటన్నికి ఒకే ఒక్క ఫొటోతో సమాధానం ఇచ్చాడు నీల్. తాజాగా చిత్ర నిర్మాత మైత్రి రవి ఈ సినిమాకు సంబందించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఓ మీడియా సమావేశంలో మైత్రి రవి మాట్లాడుతూ ‘ ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా NTR పొటెన్షియల్ ని సరిగా చూపించలేదు. ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ పీక్ స్టామినా ఏంటో చూపిస్తుంది. డ్రాగన్ కేవలం నేషనల్ లెవల్ లో కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో సెన్సేషన్ చేస్తుంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే టైటిల్ చెప్తాము. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయబోతోంది’ అని అన్నారు.