రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన చిత్రం కాంత. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాడులో రెండు రోజుల ముందుగా వేసిన ప్రీమియర్స్ నుండి సూపర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు చాలా బాగున్నాయని దుల్కర్ కెరీర్ లో మరొక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది కాంత.
రిలీజ్ రోజు మొదటి ఆట నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది కాంత. దుల్కర్ నటన అద్భుతంగా ఉందని కామెంట్స్ వినిపించాయి కానీ స్క్రీన్ ప్లే ఆకట్టుకోకపోవడంతో ఆశించిన మేర కలెక్షన్స్ రాబట్టలేక పోయింది కాంత. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ట్రేడ్ కు సినిమా వర్గాలకు షాకింగ్ విషయం అనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్ మరియు రాణా దగ్గుబాటిల కథల ఎంపిక పట్ల పై ఉన్న నమ్మకం, మరియు చెన్నైలో ప్రీమియర్ షో సమీక్షలు చూసిన తర్వాత, ఇది దుల్కర్ కి మరో క్లాసిక్ బ్లాక్ బస్టర్ అవుతుందని, సులభంగా రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని అంచనాలు వేసింది ట్రేడ్. కానీ వాటంన్నింటిని తారుమారు చేస్తూ ఈ చిత్రం రూ. 40 కోట్ల లోపు క్లోజ్ అయింది. తెలుగులోను ఈ సినిమా కేవలం రూ. 6 కోట్లు వసూలు చేసి ప్లాప్ అయింది. కాంత రిజల్ట్ అటు దుల్కర్ కు ఇటు రానా కు షాకింగ్ విషయమనే చెప్పాలి. ఇక కాంత ప్లాప్ తో టాలీవుడ్ లో హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకుంది నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.