టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఒక వైపు నిర్మాతగా సినిమాలు తెరకెక్కిస్తూనే మరొకవైపు హీరోగా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘హిట్ 3’. గతంలో విడుదల అయినా రెండు సినిమాలకు కొనసాగింపుగా దీనిని తెరకెక్కించారు. హిట్ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలు ఇన్వెస్టిగేషన్ తరహాలో తీస్తే, ఇప్పుడు రాబోతున్న ‘హిట్ 3’ మాత్రం యాక్షన్, రక్తపాతం అనేలా తీశారు. ఇప్పటికే పిల్లలు సినిమా చూసేందుకు రావొద్దని నాని క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే మే 1న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా, గత కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు నాని. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటు మూవీకి సంబంధించిన విషయాలు పంచుకుంటు ఉన్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన నాని దర్శకుడు శైలేష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
Also Read : Anushka : ‘ ఘాటి’ ప్రాజెక్ట్ నుండి కూడా క్రిష్ తప్పుకున్నాడా.. ?
నాని మాట్లాడుతూ.. ‘శైలేష్ ఫస్ట్ షెడ్యూల్‌లో చాలా మొహమాట పడేవాడు. అన్నింటికీ నన్ను మెంటార్‌లా చూసి అన్నీ నన్ను అడిగేవాడు. నన్నేం అడగకు అని ఒక్కసారి గట్టిగా క్లాస్ పీకాను. నీకు మంచి సినిమా సెన్స్ ఉందని చెప్పాను. అప్పటి నుంచి రెచ్చిపోయాడు’ అని నాని చెప్పుకొచ్చాడు. ఇకపోతే హిట్ 3 లో నాని హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీతో కూడా నాని సక్సెస్ సాధిస్తాననే నమ్మకంగా ఉన్నారు. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే నాని నమ్మకం నిజమయ్యేలా కనిపిస్తుంది.