Anushka : ‘ ఘాటి’ ప్రాజెక్ట్ నుండి కూడా క్రిష్ తప్పుకున్నాడా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి టాలెంట్ గురించి మనకు తెలిసిందే. ఆయన తెరకెక్కించిన ఏ మూవీ అయిన ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతాయి. ఏ దర్శకుడు టచ్ చేయని కాన్సెప్టులతో క్రిష్ పలు సినిమాలు తెరకెక్కించాడు. కానీ ప్రజంట్ క్రిష్ టైమింగ్ బాలేదు. ముందుగా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘హరిహర వీరమల్లు’ చిత్రం తెరకెక్కించగా,ఈ మూవీతో క్రిష్ జాతకం మారిపోవడం ఖాయం అని అనుకున్నారు. 9 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేద్దామని స్పీడ్ మీద ఉన్న క్రిష్.. ఫస్ట్ హాఫ్ ని చాలా తొందరగా పూర్తి చేశారు. కానీ మధ్యలో కరోనా, లాక్ డౌన్ అంటూ గ్యాప్ వచ్చింది. ఇక అంత క్లియర్ అయిన టైంలో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు..
Also Read : Suhas : తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సుహాస్..
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
ఇక ఈ మూవీ నుండి తప్పుకున్న తర్వాత అనుష్కతో ‘ఘాటి’ మొదలు పెట్టాడు. గత ఏడాది టీజర్ కూడా విడుదల చేసి మూవీపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా మూవీపై ఆసక్తి కలిగేలా చేసింది. అయితే ఈ చిత్రాని ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఈ సినిమా పరిస్థితి అయోమయంగా మారింది.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై క్లారిటీ కూడా లేకుండా పోయింది. అంతే కాదు ప్రేక్షకుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఏంటంటే ఈ మూవీ కూడా మధ్యలో ఆగిపోయిందా?, లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు క్రిష్ సినిమాలకే ఎందుకు ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంతకు ముందు కూడా బాలీవుడ్ లో ఆయన ‘మణికర్ణిక’ వంటి చారిత్రాత్మక చిత్రాన్ని మొదలు పెట్టి, మధ్యలో వెళ్ళిపోయాడు. మిగిలిన సినిమా కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. ‘హరిహర వీరమల్లు’ని మధ్యలోనే వదిలిపెట్టేశారు. ఇక ఇప్పుడు ఘాటీని కూడా మధ్యలోనే వదిలేశారా అన్న ప్రశ్న తలెత్తుతుంది
- Tags
- ‘Ghati’ project
- Anushka
- Krish
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!