తెలుగు సినీ పరిశ్రమలో అటు హీరోలతో దర్శకులు దర్శకులతో హీరోలు మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. ఒక్కసారి ఫలానా హీరోతో దర్శకుడు చేయాలనుకున్న సినిమా క్యాన్సిల్ అవ్వడమో లేక ఫలానా దర్శకుడితో హీరో చేయాలనుకున్న సినిమా క్యాన్సిల్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఒక్కసారి మనస్పర్థలు రావడంతో వారి మధ్య దూరం పెరిగిన దాఖలాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే తాజాగా జరిగిన మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆ సినిమా దర్శకుడు నక్కిన త్రినాధరావు అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. దీంతో అల్లు అర్జున్తో గతంలో సినిమా చేయడానికి కూడా ప్రయత్నాలు చేసిన ఈ దర్శకుడికి ఇప్పుడు అల్లు అర్జున్ తో సత్సంబంధాలు లేవా అందుకే అల్లు అర్జున్ చేయగా వైరల్ అయిన ఒక పనిని ఆయన అదే హోటల్లో అదే వేదిక మీద చేసి చూపించారా? అనే చర్చలు మొదలయ్యాయి.
Sankranti Celebrations: విశాఖలో సంక్రాంతి సందడి.. జీవీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు మొదలు
ఇక రాజేష్ దండా నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్ మీద మజాకా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రావు రమేష్, సందీప్ కిషన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరికి జంటగా రీతు వర్మతో పాటు మన్మధుడు హీరోయిన్ అన్షు నటిస్తున్నారు. వీరిలో రీతు వర్మ పేరు మరిచిపోయినట్టు చేసిన దర్శకుడు నక్కిన త్రినాధరావు తర్వాత రెండోసారి కూడా అది రిపీట్ చేశారు. అయితే ఎందుకో ఇది అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేసినట్లు ఉంది అని ప్రశ్నించగా అదేమీ లేదని తాను సరదాగా మీ అందరిని నవ్వించడం కోసమే చేశానని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కామెంట్లు ఇప్పటికే మొదలయ్యాయి.