రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు కారణంగా గుంటూరు కు చెందిన మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్ సాయి తో కలిసి పార్టీల్లో పాల్గొన్నప్పుడు మత్తుమందు కలిపి పలువురు మహిళలపై అత్యాచారం చేశాడని, ఆ వీడియోలను చూపించి బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసి వాటిని కూడా సీక్రెట్ గారికార్డు చేసాడని అందుకు సంబందించిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. ఈ కేసులో మరిన్ని వాస్తవాలను రాబట్టేందుకు మస్తాన్ సాయిని తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు.
The Raja Saab: రాజా సాబ్ మరింత ఆలస్యం .. ఆ డేట్ కోసమే?
అయితే ఇదిలా ఉండగా యువతులతో మస్తాన్ సాయి ఎమోషనల్ డ్రామాకి తెర లేపినట్టు తెలుస్తోంది. యువతులతో సైకోలా ప్రవర్తించిన మస్తాన్ సాయి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎవరైనా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అనగానే.. ఆత్మహత్య చేసుకుంటాను అని.. తనకు తాను కొట్టుకుంటూ వికృతంగా ప్రవర్తిస్తున్న మస్తాన్ సాయి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో కొట్టుకుంటున్నట్లు ప్రవర్తిస్తూ సదరు యువతిని భయపెడుతున్నాడు.