ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమవుతోంది. ఈ సినిమా మరియు ముఖ్యంగా రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ సినిమా వార్ 2 షెడ్యూల్స్ కొన్ని మారాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ లేకుండా సినిమా పట్టాలెక్కించడం కరెక్ట్ కాదని నీల్ దాన్ని హోల్డ్ లో పెట్టారు. గురువారం నుంచి సినిమా కోసం సిద్ధం చేసిన ఒక స్పెషల్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.
Trivikram: త్రివిక్రమ్ నెక్ట్ ఏంటి?
ఇక ఈ సినిమాకి సంబంధించి డ్రాగన్ అనే ఒక టైటిల్ ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. ఇక ప్రశాంత్ నీల్ సిగ్నేచర్ అయిన డార్క్ టోన్ లోనే ఈ సినిమా కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఎప్పటిలాగే ప్రశాంత్ నీల్ టీం ఈ సినిమాకి పనిచేస్తుంది. ముఖ్యంగా రవి బస్రూర్ ఇప్పటికే సంగీతం మీద కూర్చున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి డ్రాగన్ టైటిల్ ఉండడంతోనే మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్న తమిళ డ్రాగన్ సినిమాకి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.