ప్రభాస్ హీరోగా ప్రస్తుతానికి మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ సినిమా ఒక హారర్ కామెడీ నేపథ్యంలో సాగుతోంది. ప్రభాస్ కి ఇలాంటి జానర్ సినిమా చేయడం ఇదే మొదటిసారి దీంతో అభిమానులు మారుతి ఈ సినిమాని ఎలా డీల్ చేస్తున్నాడా అనే అంశం మీద చాలా టెన్షన్ తో ఉన్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ పలుసార్లు పలుకు కారణాలతో వాయిదా పడింది.
Devara 2: ‘దేవర 2’కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్
ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అప్పుడు కూడా రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతానికి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే పేరుతో ఉన్న ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కారణంగా రాజా సాబ్ లేట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాని సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా వేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దసరా హాలిడే సీజన్ కి ముందు వస్తున్న వీక్ కావడంతో ఆ టైం సినిమాకి బాగా కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. మారుతి డైరెక్టు చేస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహన్ తో పాటు నిధి అగర్వాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.