Mahakumbh 2025 : మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. 45 రోజుల్లో 40 కోట్లకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఈసారి విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాకు చేరుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున మూడు కోట్లకు పైగా ప్రజలు స్నానమాచరించారని చెబుతున్నారు. ప్రస్తుతం, మహాకుంభమేళా ఏఐ జనరేటెడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:MP Chamala Kiran: కేసీఆర్ ఉప ఎన్నిక వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫస్ట్ రియాక్షన్..
ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను మహా కుంభమేళాలో చూపించారు. ఏఐ వీడియోలో, ఎలోన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్, కిమ్, మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, విల్ స్మిత్, రిషి సునక్, జెండయా, టామ్ హాలండ్, జాన్ సెనా, జస్టిన్ ట్రూడో వంటి ప్రముఖులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. యూజర్లు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో సంగంలో స్నానం చేస్తున్నట్లు మొదటగా చూపించారు.
Read Also:TG DGP: రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే అది చాలా ముఖ్యం.. టీజీ డీజీపీ స్పష్టం
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేశారు. దీనికి ‘సెలబ్రిటీలు మహాకుంభ ప్రయాగ్‌రాజ్‌లో’ అనే క్యాప్షన్ ఉంది. దీనికి ఇప్పటివరకు లక్షల కొద్ది లైక్‌లు వచ్చాయి. అలాగే, ఆ వీడియోకు ఇప్పటివరకు మిలియన్ల వ్యూస్ సాధించింది. వీడియో చూసిన తర్వాత చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
AI technology ne ninke paap dho diye Mahakumbh mein lakar.. 😍😀
Jai ho Gange Maa🙏❤️#HarHarMahadevॐ 🔱🙏#MahaKumbh2025 #Prayagraj #Wednesdaymorning ☀️ #JaiGanesh 🙏🚩#Trump
Via WA pic.twitter.com/zbI9GmQvbs— Dil Toh Bachcha Hai Ji🇮🇳🚩 (@bronz_O_Genius) February 19, 2025