హీరోలలో మాలీవుడ్ హీరోలే వేరయ్యా అన్నట్లు ఉంటారు. కేవలం యాక్టింగే కాదు కొత్తగా ఇంకెదో ట్రై చేయాలని చూస్తుంటారు. నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు, యాక్షన్ కట్ అని దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో ఉన్న ఈ పరంపర ఇప్పుడు ఊపందుకుంది. మెగాఫోన్ పట్టాలన్న పిచ్చి 400 సినిమాలు చేసిన లాలట్టన్‌ను కూడా వదల్లేదు. బర్రోజ్ అనే వంద కోట్ల ప్రయోగాన్ని చేసి చేతులు కాల్చుకున్నాడు. మరోసారి ప్రయోగం చేస్తాడో లేదో తెలియదు ఓ ఎంటప్ట్ అయితే చేశాడు.
Also Read : Kollywood : స్టార్ హీరో సినిమాను వెనక్కినెట్టిన సీనియర్ హీరో
నటుడిగా కెరీర్ స్టార్టింగ్‌లోనే కెమెరా పట్టాడు బాసిల్ జోసెఫ్. మిన్నల్ మురళి లాంటి సూపర్ మూవీ తీసి హీరోగా దూసుకెళ్తున్నాడు. మిగిలిన హీరోస్ కమ్ దర్శకులతో పోల్చుకుంటే స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ మాలీవుడ్‌కు ఓ ట్రెండ్ సెట్టర్ అయిపోయాడు. యాక్టర్‌గా పీక్స్ టైంలో కూడా డైరెక్టర్‌గా హ్యాట్రిక్ కొట్టేశాడు. ఇక మరో సీనియర్ మలయాళ నటుడు జోజూ జార్జ్ కూడా రీసెంట్లీ దర్శకుడిగా మారాడు. పని అనే మూవీతో హిట్ కొట్టి ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసుకురాబోతున్నాడు. అలాగే వినీత్ శ్రీనివాసన్ టాలెంట్ యాక్టర్ కూడా హృదయం అనే రొమాంటిక్ డ్రామాను అందించాడు. ఇప్పుడు మార్కో హీరో ఉన్ని ముకుందన్ కూడా మెగా ఫోన్ పై మనసు పారేసుకుంటున్నాడు. మిన్నల్ మురళి తరహాలోనే ఓ సూపర్ హీరో మూవీని ప్లాన్ చేస్తున్నాడు. శ్రీ గోకులం మూవీ బ్యానర్ పై తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రాన్ని గోకులం గోపాలన్ నిర్మించనున్నారు. ఇప్పటికే వయలెంట్ హీరోగా మాలీవుడ్ ఎన్నడూ చూడని వయెలెన్స్ చిత్రాన్ని మార్కోతో చూపించిన ఉన్ని ముకుందన్ మరి దర్శకుడిగా ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.