సైలెంట్‌గా ‘లవ్ టుడే’ అనే సినిమా చేసి తెలుగులో సైతం బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆ తర్వాత ఆయన చేసిన ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ సినిమాలకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే ఏడాది నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమా కూడా చేశాడు. ఈ సినిమా వాస్తవానికి డిసెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఆ మరుసటి రోజే ‘అవతార్’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దానికి తోడు, ఈ సినిమా తెలుగు వెర్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు.
Also Read:Mahavatar: పరశురాముడి కథలోకి దీపికా? ‘మహావతార్’ పై బాలీవుడ్ బిగ్ బజ్
కచ్చితంగా తన సినిమాని తమిళంతో పాటు తెలుగులో సైతం రిలీజ్ చేయాలని పట్టుబడుతున్న ప్రదీప్ రంగనాథన్‌కు అది సాధ్యం కాదని తెలియడంతో, సినిమాని ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే, వాలెంటైన్స్ వీక్‌లో ఈ లవ్ సినిమా బాగా వర్కవుట్ అవుతుందని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. మొత్తం మీద, ఈ ఏడాది వరుసగా మూడు హిట్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ప్రదీప్ రంగనాథన్ ఆశలకు మాత్రం గండి పడినట్లే చెప్పాలి.
Also Read:Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు
ఇక ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఒక సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోంది. ఈ సినిమాను విగ్నేష్ శివన్ ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్‌తో పాటు ‘సెవెన్ స్క్రీన్ స్టూడియో’ సంయుక్తంగా నిర్మిస్తోంది. 2040లో సాగబోతున్న కథగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథంతో పాటు కృతి శెట్టి, ఎస్.జె. సూర్య, యోగి బాబు, గౌరీ కిషన్, మీస్కిన్, ఆనంద్ రాజ్, సునీల్ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.