నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. అయితే, అనూహ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో, ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక రోజు ముందు, అంటే డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం కనిపిస్తోంది.
Also Read:Tata Nexon: మారుతి , మహీంద్రా కంపెనీల కార్లను అధిగమించించిన నెక్సాన్
ఇక, ఇదిలా ఉండగా, ఈ సినిమాలో బోయపాటి శ్రీను కుమారులు ఇద్దరూ భాగమవడం గమనార్హం. ఈ సినిమాలో బోయపాటి శ్రీను పెద్ద కుమారుడు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాక, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సహా, ప్రమోషన్స్‌లో సైతం బోయపాటితో పాటు ఆయన పెద్ద కుమారుడు సైతం కనిపిస్తూ వస్తున్నారు. ఇక, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రహ్లాదుడిగా బోయపాటి శ్రీను చిన్న కుమారుడు నటిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌లో కూడా చిన్న పార్ట్ గ్లిమ్స్ ఉంది. నిజానికి, బోయపాటి చిన్న కుమారుడు ‘లెజెండ్’ సినిమాలో కూడా “మావయ్య” అనే ఒక చిన్న డైలాగ్‌తో బాగా వైరల్ అయ్యాడు. ఆ బుడతడిని చూసి అందరూ పాప అనుకున్నారు కానీ, వాస్తవానికి బోయపాటి కుమారుడే ఆ డైలాగ్ పలికింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి తన చిన్న కుమారుడిని స్క్రీన్ మీద చూపించబోతున్నారు బోయపాటి శ్రీను.