బాలీవుడ్ అందాల రాశీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ఆ తరువాత మళ్లీ బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కనిపించి ప్రేక్షకులను ఆమె అందం వైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు మళ్లీ తెలుగులో ఈ అమ్మడు ఓ సినిమా ఓకే చేసింది.
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC15 సినిమాలో కియారా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఆమె ఈ సినిమాను ఓకే చేసేందుకు అనేక కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటం మొదటి కారణం అయితే.. ఆయన తెరకెక్కించే సినిమాల్లో హీరోయిన్లకు అదిరిపోయే గుర్తింపు వస్తుందట. అంతేగాక.. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనుండటం, అమ్మడికి పారితోషకం కూడా భారీగానే అందనుండటంతో ఈ సినిమాలో నటించేందుకు కియారా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి కియారా అద్వానీ మళ్లీ తెలుగు సినిమా చేస్తుందని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఆమె ఈ సినిమాను ఒప్పుకునేందుకు తన లెక్కలు తాను వేసుకుంది. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలని ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Gold Rate Today: మహిళలకు శుభవార్త.. మరింత తగ్గిన పసిడి ధర