యశ్, శ్రీనిధి శెట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా “కేజీఎఫ్ : చాప్టర్ 2” ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా హైప్ ఉన్న చిత్రాలలో ఒకటి. యష్ ‘రాకీ’గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లు కూడా నటించడం అంచనాలను పెంచేసింది. సంజయ్ దత్ సినిమాలో విలన్ “అధీరా” పాత్రను పోషిస్తుండడం ప్రధాన హైలైట్. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా “కేజీఎఫ్ : చాప్టర్ 2” మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోంబాలే ఫిల్మ్స్ అధికారిక ట్విట్టర్ లో “యుద్ధం పురోగతి కోసం ఉద్దేశించబడింది. రాబందులు కూడా నాతో అంగీకరిస్తాయి” – అధీరా, హ్యాపీ బర్త్ డే సంజయ్ దత్” అంటూ ఈ పోస్టర్ పై రాసుకొచ్చారు.
Read Also : “మహా సముద్రం” మోషన్ పోస్టర్
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “కేజీఎఫ్ 2″లో మాళవిక అవినాష్, ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, రావు రమేష్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన “కేజీఎఫ్ : చాప్టర్ 2” టీజర్ యూట్యూబ్‌లో 200 మిలియన్ల వీక్షణలను చేరుకుంది. “కేజీఎఫ్ 2″ను త్వరలోనే విడుదల చేయనున్నారు. మేకర్స్ దేశవ్యాప్తంగా సినిమా హాళ్ళు రీఓపెన్ కావడం కోసమే ఎదురు చూస్తున్నారు.
"War is meant for progress, even the vultures will agree with me" – #Adheera, Happy Birthday @duttsanjay sir.#KGFChapter2 @TheNameIsYash @VKiragandur @hombalefilms @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @VaaraahiCC @PrithvirajProd @DreamWarriorpic @LahariMusic pic.twitter.com/VqsuMXe6rT
— Prashanth Neel (@prashanth_neel) July 29, 2021