“మహా సముద్రం” మోషన్ పోస్టర్

సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది 2021 ఆగస్టు 19న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్లపై దృష్టిని సారించారు. ఈ క్రమంలో తాజాగా “మహా సముద్రం” మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Read Also : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… త్వరలో బిగ్ అప్డేట్

క్యారెక్టర్స్ ఇంట్రోకు సంబంధించిన ఈ వీడియోను అజయ్ భూపతి తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ఉండగా… త్వరలోనే అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “మహా సముద్రం” మోషన్ పోస్టర్ లో చైతన్ భరద్వాజ్ సంగీతం, ప్రధాన పాత్రధారుల సీరియస్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ యొక్క కోపంగా కనిపించడం వారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సిద్ధార్థ్ చేతిలో తుపాకీ పట్టుకొని ఉండగా, శర్వానంద్ సీరియస్ గా కనిపిస్తాడు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-