Karnataka MLA Donates Blood at Chiranjeevi Blood Bank: కర్ణాటక MLA ప్రదీప్ ఈశ్వర్ ఈరోజు హైదరాబాద్ లో రక్తదానం చేశారు. కర్ణాటక – చిక్ బళ్ళాపూర్ శాసన సభ్యులు ప్రదీప్ ఈశ్వర్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఈ రోజు రక్తదానం చేశారు. వారితో పాటు బంధువులు రమేష్ బాబు గారు కూడా రక్తదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి హైదరాబాదు వచ్చిన ఆయన అంతకంటే ముందు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్త దానం చేసినట్లు తెలుస్తోంది.
Rekha Boj: ఇంకో జన్మ ఎత్తినా మారరు.. తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్
ఇక అనంతరం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మర్యాద పూర్వకంగా ప్రదీప్ ఈశ్వర్ కలవగా, రక్తదానం చేసినందుకు ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి MLAని అభినందించారు. ఈ మేరకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా చికెన్ గున్యాతో బాధ పడుతున్నారు. కొద్దిగా కోలుకున్న ఆయన ఈరోజు నాగబంధం అనే సినిమా ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.