Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 సెన్సేషనల్ బుకింగ్స్..డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన కాంతార చాప్టర్ వన్ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందుగానే, అంటే అక్టోబర్ 1న ప్రీమియర్ షోలతో స్క్రీనింగ్స్ ఆరంభమైన ఈ చిత్రం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాంతార మొదటి భాగం సృష్టించిన సంచలనం తర్వాత, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను కాంతార చాప్టర్ వన్ అన్ని విధాలుగా అందుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకులు ఈ సినిమాను ‘డివైన్ బ్లాక్‌బస్టర్’గా కొనియాడుతూ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో, మొదటి రోజు కలెక్షన్స్ భారీగా నమోదై, అధికారిక ప్రకటన ప్రకారం సుమారు 89 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ లెక్కన కాంతార చాప్టర్ వన్ 2025లో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.
Also Read : Tollywood Actress : లక్కీ హీరోయిన్ చేతిలో 8 సినిమాలు..అన్ని బడా సినిమాలే
Also Read
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను ఏ స్థాయిలో అందుకుందంటే, ఒక్క బుక్ మై షో యాప్‌లోనే రిలీజ్ రోజున 1.28 మిలియన్‌కు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఇతర ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌లతో పాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌లను కలుపుకుంటే, మొదటి రోజు కలెక్షన్స్ సెన్సేషనల్ రికార్డ్‌ను నమోదు చేసినట్లు తెలుస్తోంది. రెండవ రోజు కూడా ఈ జోరు కొనసాగుతోంది. గంటకు 70 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయంటే, కాంతార చాప్టర్ వన్ ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Also Read :Akshay Kumar: నా కూతురు న్యూడ్ పిక్స్ అడిగాడు.. అక్షయ్ కుమార్ సంచలనం
రిషబ్ శెట్టి నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉందని, కథను నడిపించిన తీరు నెక్స్ట్ లెవెల్‌లో ఉందని ప్రేక్షకులు, విమర్శకులు కొనియాడుతున్నారు. ఈ చిత్రాన్ని కన్నడ భాషలో రూపొందించి, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించి, సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రతిభ, నటనా నైపుణ్యం, హొంబాలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు, బలమైన కథాంశం కలిసి ఈ సినిమాను 2025లో ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిపాయి. ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్‌డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!