బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో పాల్గొన్న సందర్భంగా తన 13 ఏళ్ల కూతురు ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని బహిర్గతం చేశారు. ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఎలా పిల్లలను టార్గెట్ చేస్తున్నారో వివరించారు. “ఇది నా బిడ్డకు మాత్రమే జరిగిన ఘటన కాదు. ప్రతి తల్లిదండ్రులు హెచ్చరికలు తీసుకోవాలి” అని హాట్ కామెంట్స్ వేస్తూ పేరెంట్స్‌ను అప్రమత్తం చేశారు.
Also Read : Tollywood Actress : లక్కీ హీరోయిన్ చేతిలో 8 సినిమాలు..అన్ని బడా సినిమాలే
సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో మాట్లాడుతూ అక్షయ్ కుమార్ తన కుమార్తె ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా జరిగిన ఘటనను వివరించారు. “మా పాప ఆన్‌లైన్ గేమ్‌లో ఆడుతుండగా, ఒక అజ్ఞాతుడు నుంచి మెసేజ్ వచ్చింది. ‘బాగా ఆడుతున్నావు’ అంటూ ప్రశంసించాడు. మంచివాడిగా నటిస్తూ, ఆమెను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ‘నువ్వు మేలా? ఫీమేలా?’ అంటూ ప్రశ్నలు వేశాడు. పేరు చెప్పగానే న్యూడ్ ఫోటోలు పంపాలని బెదిరించాడు” అని గుర్తుచేశారు.
Also Read : NBK111 : మరో విధ్వంసానికి ముహూర్తం పెట్టిన బాలయ్య – గోపీచంద్ మలినేని
అక్షయ్ కుమార్ మాటల ప్రకారం, ఆన్‌లైన్ గేమ్‌లు పిల్లలకు వినోదం కావచ్చు, కానీ అవి సైబర్ క్రిమినల్స్‌కు ‘హంటింగ్ గ్రౌండ్’గా మారాయి. మైనర్స్‌ను టార్గెట్ చేసి, వారి అమాయకత్వాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, బెదిరించడం వంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. “పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. ప్రతి మెసేజ్, ప్రతి ఇంటరాక్షన్‌ను మానిటర్ చేయాలి” అని హెచ్చరించారు. భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా, పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపడంతో, వారిని లక్ష్యంగా చేసుకున్న గ్రూమింగ్, బుల్లింగ్, ఎక్స్‌టార్షన్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.