రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన కాంతార చాప్టర్ వన్ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందుగానే, అంటే అక్టోబర్ 1న ప్రీమియర్ షోలతో స్క్రీనింగ్స్ ఆరంభమైన ఈ చిత్రం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాంతార మొదటి భాగం సృష్టించిన సంచలనం తర్వాత, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను కాంతార చాప్టర్ వన్ అన్ని విధాలుగా అందుకుందని చెప్పవచ్చు.…