నందమూరి కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించిన కళ్యాణ్ రామ్ తాజాగా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్‌కి డేట్ లాక్ చేశారు మూవీ టీం.
Also Read: Megastar : చిరంజీవి కి యు.కె పార్లమెంట్ లో సన్మానం
ఫస్ట్ లుక్ పోస్టర్‌తో గ్రేట్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిన ఈ మూవీ టీజర్‌ను, మార్చి17న విడుదల చేస్తామని మేకర్స్ చిన్న వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. కాగా వీడియోలో కళ్యాణ్ రామ్ రక్తంతో తడిచిన వైట్ షెట్‌లో బీచ్ వద్ద కుర్చునట్లుగా చూపించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసుకోగా. మిగిలిన పనులు పూర్తయ్యాక, రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ అందించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా అందించారు.
TEASER ON MARCH 17th. #ArjunSonOfVyjayanthi pic.twitter.com/rErnaaGSSo
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) March 14, 2025