Jr NTR Devara Trailaer: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ దేవర దిగేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తుంది సినిమా యూనిట్. ఇక అందులో భాగంగానే ముంబై బేస్ గా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఒకటి నిర్వహించి ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
Lavanya – Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య.. మాకేంట్రా ఇదీ?
సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ హైప్ మరింత ఎక్కించేలానే ఉంది. ఈ సినిమాని యువసుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేనితో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ ను చాలా ఆసక్తికరంగా కట్ చేశాడు డైరెక్టర్. సినిమాలో ఉన్న ఇంటెన్స్ మొత్తాన్ని ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారానే క్లారిటీ ఇచ్చేశారు.
అసలు ఎవరు వాళ్ళు అంతా? అని ఒకరు అడుగుతుంటే కులం లేదు, మతం లేదు భయం అనేది అసలే లేదు అంటూ చూపిస్తున్న ట్రైలర్ లో షిప్ లోకి ఎక్కి అక్కడి క్రూ మొత్తాన్ని కొంతమంది చంపుతున్నట్టు చూపారు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటి సారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఇది చానా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ, మా దేవర కథ అని ప్రకాష్ రాజ్ చెబుతున్న డైలాగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉన్నాయ్. మనిషికి బతుకెంత ధైర్యం చాలు చంపేంత అక్కర్లేదు అని చెబుతున్న ఎన్టీఆర్ కాదు, కూడదు అయిన్ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని సంప్ భయాన్ని అవుతా అని అంటున్న డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఇక సైఫ్ అలీ ఖాన్, దేవర స్నేహితులుగా కనిపిస్తుండగా దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలి అంటూ చెబుతున్న డైలాగ్స్ కూడా అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఇక దేవర కుమారుడిగా ఎన్టీఆర్ కనిపిస్తుండగా భయస్తుడి క్యారెక్టర్ అని అర్ధం అవుతోంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తే రక్తపాతం, వయలెన్స్ పాళ్ళు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.