బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అందరి హీరోల కంటే భిన్నంగా ఉంటాడు. జయాపజయాలతో పని లేకుండా ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు ఎక్కిస్తూ.. తన అభిమానుల కోసం వరుస సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ‘స్కై ఫోర్స్’తో ప్రేక్షకుల్ని పలకరించిన అక్షయ్ కుమార్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటు కోలీవుడ్, అటు బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇలాంటి స్టార్ హీరో మూవీ పై తాజాగా అమితా బచ్చన్ సతీమణి జయబచ్చన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
Also Read: Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమాపై షాలిని పాండే షాకింగ్ కామెంట్స్..
ఇంతకీ ఏంటా మూవీ అంటే.. అక్షయ్ కుమార్, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’. ఈ మూవీని అంతా చేసే ఉంటారు. దర్శకుడు శ్రీ నారాయణ్ సింగ్ గ్రామీణ ప్రాంతాల్లోని మరుగుదొడ్ల కొరతను ఎత్తి చూపుతూ ఈ సినిమాను రూపొందించారు. తన భార్య కోరిక మేరకు గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి ఒక వ్యక్తి ఏం చేశాడు? అనేది ఈ కథ. 2017లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలు చేసి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ మూవీ పై తాజాగా జయ బచ్చన్, జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘సినిమాలు చూసే విషయంలో నేను కొన్ని పరిమితులు ఫాలో అవుతాను. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ ఒక్కసారి ఆ టైటిల్ చూడండి. అది కూడా ఒక పేరేనా? ఇలాంటి టైటిల్ ఉన్న సినిమా చూడాలని నేను ఎప్పుడూ అనుకోను. మరి మీరు ?’ అంటూ అక్కడి వారిని తిరిగి ప్రశ్నించింది. ఇందులో కొంతమంది చేతులు ఎత్తగా… ‘ఈ కార్యక్రమంలో ఇంతమంది ఉండగా.. కేవలం నలుగురు మాత్రమే ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇది నిజంగా బాధాకరం. కాబట్టి ఇది ఫ్లాప్ సినిమా’ అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.