వంద సినిమాలు తీసిన కూడా రాని ఫేమ్, కొంత మంది హీరోయిన్‌లకు ఒకే ఒక్క మూవీతో వచ్చేస్తుంది. అలాంటి హీరోయిన్‌లల్లో షాలినీ పాండే ఒక్కరు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది షాలిని పాండే. ప్రీతి పాత్రలో తన అందం, అమాయకత్వం తో అందరినీ మెప్పించింది. ఓ విధంగా ఈ సినిమా విజయంలో ఆ పాత్ర ప్రభావం చాలా ఉంది. కానీ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్ర షాలినీకి రాలేదనే చెప్పాలి. అయితే ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అయినప్పటికి.. నటీనటుల పాత్రలను కొంత మంది విమర్శిస్తూ ,హీరోయిన్ పాత్ర వీక్ అని పోస్ట్‌లు పెట్టారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని ఆ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read: Hema : శివగామి లాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయను..
రీసెంట్‌గా శాలిని ‘డబ్బా కార్టెల్’ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్ ఓటీటీలో పెద్ద హిట్ అవ్వడంతో పాటు అందులో బలమైన మహిళగా కనిపించి ప్రశంసలందుకుంటున్నది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమెను ‘అర్జున్‌రెడ్డి’ లాంటి సినిమాలో ప్రీతి తరహా పాత్ర చేయాల్సివస్తే చేస్తారా? అని ఓ విలేకరి అడగ్గా.. ‘నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా అది. ఇప్పుడు ఆ పాత్ర గురించి ఆలోచిస్తే అమాయకంగా అనిపిస్తుంది. కానీ అదే పాత్రను ఇంకాస్త బలంగా రాయొచ్చు అనుకుంటున్నా. మరోసారి ఆ తరహా పాత్ర వస్తే చేయనని చెప్పను కానీ.. దర్శకుడితో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకొని అప్పుడు చేస్తా. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు నటిగా పరిణితి చెందాను కాబట్టి ఇంకాస్త భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తా’ అంటూ చెప్పుకొచ్చింది షాలిని పాండే