Jaya Bachchan: సమాజ్‌వాది పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ట్రై చేసిన ఒక వ్యక్తిపై మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Amitabh Bachchan : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. అయితే ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై బిగ్ బీ స్పందించట్లేదు. తాజాగా ఐశ్వర్యను పొగడటంపై స్పందించాడు. అమితాబ్ తన కొడుకు అభిషేక్ ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. Read Also : Kubera : కుబేరకు కలిసొచ్చిన రష్మిక సెంటిమెంట్..…
Jaya Bachchan: ప్రముఖ బాలీవుడ్ నటి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. నిత్యం బీజేపీ, బీజేపీ నాయకులను సభలో విమర్శించే జయాబచ్చన్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. 2004 నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న జయా.. ఇటీవల ఒక డిబేట్‌లో రాజకీయాల్లోకి సినీ యాక్టర్స్ ప్రవేశం గురించి, వారి ప్రజాదరణ గురించి మాట్లాడారు. ప్రజాదరణ రాజకీయ పార్టీలకు ఎలా ప్రయోజనకరంగా మారుతుందో వెల్లడించారు. రాజకీయాల్లో సినీ నటులకు ఉండే…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అందరి హీరోల కంటే భిన్నంగా ఉంటాడు. జయాపజయాలతో పని లేకుండా ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు ఎక్కిస్తూ.. తన అభిమానుల కోసం వరుస సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ‘స్కై ఫోర్స్’తో ప్రేక్షకుల్ని పలకరించిన అక్షయ్ కుమార్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటు కోలీవుడ్,…
Jaya Bachchan: మహ కుంభమేళాపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలోని గంగా, యమునా నదుల్లోని నీరు కలుషితమైందని ఆమె సోమవారం ఆరోపించారు. గత నెలలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలోకి విసిరేసినందుకు, నదిలోని నీరు కలుషితమైందని అన్నారు.
పార్లమెంట్ దాడి ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని.. వాళ్ల నటనకు అవార్డులు ఇవ్వాల్సిందేనని జయా బచ్చన్ ఎద్దేవా చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ ఎప్పుడూ గరం గరంగా ఉంటారు. రాజ్యసభలో ఛైర్మన్‌ను కూడా దడదడలాడిస్తుంటారు. తన పేరు పక్కన అమితాబ్ బచ్చన్ పేరును ఛైర్మన్ ఉచ్ఛరించినందుకు ఓ ఆటాడుకుంది. అంతలా ఫైర్‌బ్రాండ్‌గా ఉంటారు.
Rajya Sabha: పెద్దల సభలో చైర్మన్ జగదీప్ ధంఖర్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. శుక్రవారం వీరిద్దరి మధ్య రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దంఖర్ మాట్లాడే విధానం సరిగా లేదని, ఆయన స్వరం ఆమోదయోగ్యం కాదని జయా బచ్చన్ చెప్పడంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన చైర్మన్ ధంఖర్..‘‘నాకు చదువు చెపొద్దు’’ అని అన్నారు.
రాజ్యసభలో మరోసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో చైర్మన్ సంబోధించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.