కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రానున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ ను పెంచుతున్నాయి. కాగా, తంగలాన్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షుకుల ముందుకు రానుంది . ఈ క్రమంలోనే విక్రమ్, మాళవిక విజయవాడలోని ఫేమస్ హోటల్ ‘బాబాయ్ హోటల్’ లో టిఫిన్ చేస్తూ ప్రేక్షకులతో సెల్ఫీలు దిగుతూ తంగలాన్ ను ప్రమోట్ చేస్తున్నారు.
Also Read: Mass Maharaj: మాస్ రాజా రవితేజ, శ్రీలీల సినిమా టైటిల్ ఇదే..
కర్ణాటకలోని గోల్డ్ ఫీల్డ్స్ లో కొందరు కార్మికుల జీవితాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం తంగలాన్. ఈ సినిమాలో కోలార్ ప్రాంతంలోని ఓ తెగకు నాయకుడిగా విక్రమ్ కనిపించనున్నాడు. విక్రమ్ తో సహా ఈ చిత్రంలోని నటీనటులందరూ కూడా డీగ్లామరైజ్డ్ గా కనిపించనున్నారు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కు భారీ హిట్టు దక్కి చాలా కాలం అవుతోంది. ఈ సినిమాపై విక్రమ్ తో పాటు ఆయన అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.