యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిత్రం దేవర. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుండి రానున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేవర ఫస్ట్ లుక్ తోనే అంచనాలను అమాంతం పెంచేసాడు. ఇక దేవర ట్రైలర్ వరల్డ్ వైడ్ గా సంచలను నమోదు చేసింది. ఇటీవల విడుదలైన దేవర ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ లో క్యూటీయాసిటిని పెంచింది.
Also Read: NaveenPolishetty: సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న నవీన్ పొలిశెట్టి వీడియో.. వీడియోలో ఏముందంటే..
కాగా పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న దేవర సినిమా థియేట్రికల్ రైట్స్ కు విపరీతమైన పోటీ ఏర్పడింది. మూడు ప్రముఖ సంస్థలు మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. చివరకు టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఆయిన సితార ఎంటెర్టైనమెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రెండు తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ భారీ రేట్ కు కొనుగోలు చేసాడు. రెండు భాగాలుగా రానున్న దేవరపై టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో పాజిటివ్ టాక్ వినపడుతోంది. మరోవైపు దేవర కర్ణాటక థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ చేశారు నిర్మాతలు. కన్నడ రైట్స్ ను దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు SS. కార్తికేయ కన్నడ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ KVN ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా కొనుగోలు చేసాడు. ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించాడు కార్తికేయ. మరోవైపు దేవర సెకండ్ సింగల్ ను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ లో రానున్నదేవర ను ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది దేవర.