విజయ్ సేతుపతి, త్రిష జంటగా 2018లో తమిళ్ వచ్చిన సినిమా 96. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ గా నిలిచింది. బడిలో పాఠాలు నేర్చుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట అనుకోని కారణాల వలన దూరం అయి, దాదాపు 20 ఏళ్ల తర్వాత స్కూల్ రీ యూనియన్ పార్టీలో కలిసినపుడు వారి మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో వచ్చిన 96 ప్రేక్షకులను విశేషంగా అలరించింది. జాను పాత్రలో త్రిష విజయ్ సేతుపతి యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.
Also Read : Manchu Manoj : పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదం
అయితే ఈ సినిమా గురించి ఇటీవల చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ‘ 96 సినిమాకు మొదట అనుకున్న హీరో విజయ్ సేతుపతి కాదు. వాస్తవానికి ఈ కథను బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. కానీ అభిషేక్ ను కలిసేందుకు నాకు కాంటాక్ట్ దొరకలేదు. అలా ఆ కథని విజయ సేతుపతి కి చెప్పడం ఆయన ఒప్పుకోవం, సూపర్ హిట్ కావడం చక చక జరిగిపోయాయి. ఆలాగే ఆ సినిమాకు సీక్వెల్ ముందుగా లేదు. 96 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ఆలోచన వచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొతం ఫినిష్ చేశాను. విజయ్ సేతుపతి, త్రిష డేట్స్ ను బట్టి షూటింగ్ ఉంటుంది’ అని అన్నారు. ముందుగా అనుకున్నట్టు 96 ను అభిషేక్ బచ్చన్ తో చేసి ఉంటె ఎలా ఉండేదోనని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.