సినీ నటుడు మంచు మనోజ్ గతరాత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలేం జరిగిందంటే అర్ధరాత్రి పోలీసులు నిర్వహించే పెట్రోలింగ్ లో భాగంగా భాకరపేట సమీపంలో ఉన్న ప్రైవేటు గెస్ట్ హౌస్ తనిఖీ కి వెళ్లారు ఎస్ ఐ. ఆ సమయంలో గెస్ట్ హౌస్ లో ఉన్న మంచు మనోజ్ అసలు తనగెస్ట్ హౌస్ కు ఎందుకు వచ్చారు, నన్ను అరెస్టు చేయడానికి మీరు వచ్చారంటూ ఎస్ ఐతో మనోజ్ గొడవకు దిగారు. డిఎస్పీకి ఫొన్ చేసి తన రూంలోకి ఎస్ ఐ అనుమతి లేకుండా వచ్చాడని మనోజ్ తెలిపాడు.
అయితే తాను అరెస్టు చేయడానికి రాలేదని, కేవలం భద్రత తనిఖీ కోసం వచ్చానని ఎస్ ఐ చెబుతున్న వినిపించుకోలేదు మంచు మనోజ్. ఎస్ ఐ తిరిగి స్టేషను వెళుతుంటే నేను వస్తానంటూ వెనుకనే భాకరపేట పోలీస్ స్టేషనుకు వెళ్ళాడు మనోజ్. తాను రిసార్ట్ లో ఉంటే సైరన్ ఎందుకు వేస్తారని, తన ప్రైవసీని ఎందుకు డిస్ట్రబ్ చేస్తారని ఎస్ఐని ప్రశ్నించాడు మనోజ్. అనంతరం రిసార్ట్స్ నుంచి భాకరాపేట పోలీస్ స్టేష న్ చేరుకుని సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో వాదనకు దిగాడు మనోజ్. సీఎం పేరుతో తనను, తన అనుచరులను పోలీసులు బెదిరిస్తున్నారు. సీఎంస్థాయి వ్యక్తి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకుంటారని మనోజ్ ప్రశ్న. మోహన్ బాబు విశ్వవిద్యాలయం వద్ద వున్నతన అనుచరుల షాపులను ధ్వంసం చేస్తే మాత్రం పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని తనను మాత్రమే ఇబ్బంది పెడుతున్నారని మనోజ్ పోలీసులతో వాదించాడు.